లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

విషాదం…ఇంట్లో కొడుకు, ఆస్పత్రిలో తల్లి ఒకే రోజు మృతి

Published

on

motherson-died-same-day-tragedy-in-warangal-rural-distric1

కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గురయ్యింది.నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతూ చికిత్స కోసం పట్టణంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి వెళ్ళింది. కరోనా లక్షణాలు ఉండటంతో వారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళమని సూచించారు. ఆమె వరంగల్ ఎంజీఎం లో చేరి నాలుగు రోజులుగా చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్నప్పటికీ వ్యాధి ముదరటంతో ఆమె మంగళవారం తెల్లవారుఝామున కన్నుమూసింది.

ఇంటి వద్ద పడుకుని ఉన్న కుమారుడుకి ఈ విషయం చెప్పటానికి ఇంట్లోవారు నిద్రలేప బోగా…. అప్పటికే రక్తంకక్కుకుని మంచంపై మరణించి ఉన్నాడు. ఇలా ఒకే రోజు ఆస్పత్రిలో తల్లి, ఇంటివద్ద కుమారుడు మరణించటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *