సినిమాగా బాబు, వై.ఎస్.ఆర్ స్నేహం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితకథల ఆధారంగా తరకెక్కిన బయోపిక్స్ మంచి ఆదరణ చూరగొన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలోనూ, విడుదలకు సిద్ధంగానూ ఉన్నాయి. టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్స్ తెరకెక్కగా తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.వివ‌రాల్లోకెళ్తే.. చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇద్ద‌రూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేశారు. ప్రారంభ ద‌శ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒకే పార్టీలో త‌మ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. మంచి మిత్రులుగా మొద‌లైన వారి ప్ర‌యాణం క్ర‌మంగా ఆలోచ‌న‌లు, విధానాల వ‌ల్ల వారి మ‌ధ్య స్నేహం ఎలా వైరంగా మారింది? అనే అంశాల‌ను ఆధారంగా చేసుకుని సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.సెమీ సైంటిఫిక్ష‌న్ క‌థాంశంతో 1980 నుండి 2000 సంవ‌త్స‌రాల మ‌ధ్య చంద్ర‌బాబు, వై.ఎస్‌.ఆర్ ప్ర‌యాణం ఎలా సాగింది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా సాగుతుంద‌ని టాక్‌. రెండు భాగాలుగా రూపొంద‌బోయే ఈ సినిమాను విష్ణు ఇందూరి (ఎన్టీఆర్ బయోపిక్, తలైవి చిత్రాల నిర్మాత) తిరుమ‌ల రెడ్డి నిర్మిస్తార‌ని తెలుస్తోంది.

Related Posts