త్వరలో సినిమా థియేటర్లు రీఓపెన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

క‌రోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమ‌లవ్వడంతో దేశ‌వ్యాప్తంగా ఎప్పుడూ సంద‌డిగా ఉండే సినిమా థియేట‌ర్లు మూతప‌డ్డాయి. కరోనా ప్రభావంతో థియేట‌ర్లను మూసుకుని 3 నెల‌ల‌కుపైనే అవుతుంది. అయితే ఆ త‌ర్వాత ద‌శ‌ల‌వారీగా కేంద్రం లాక్ డౌన్ ను ఎత్తివేసింది. దేశంలో అన్ లాక్ అమ‌ల‌వుతున్నా ప‌లు రాష్ట్రాల్లోని న‌గ‌రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల రీఓపెనింగ్ పై డైలామా కొన‌సాగుతూనే ఉంది. అయితే కేంద్రం ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తివ్వాల‌ని స‌మాలోచ‌న‌లు చేస్తోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్ల‌ను ఓపెన్ చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌యోప‌రిమితి ఆధారంగా థియేట‌ర్ల‌లోకి అనుమ‌తించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ప్ర‌తరోజు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేట‌ర్లు ఓపెన్ చేయాల్సి వ‌స్తే..కేసుల తీవ్ర‌త మ‌రింత అవ‌కాశాలుంటాయి. కానీ ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశాయి. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు రీఓపెన్ చేయ‌డం ఎంతవ‌ర‌కు సాధ్యమ‌వుతుంద‌ని వేచి చూడాలి మరి.

Related Posts