Movie tickets for those who follow traffic rules

ట్రాఫిక్ నిబంధనలు పాటించినవారికి సినిమా టికెట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లను బహుమతిగా ఇస్తున్నారు.

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లను బహుమతిగా ఇస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 1, 2019) బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఏసీపీ గోవర్దన్, ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్‌రావు, ముత్తు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు. 

అన్ని పత్రాలను కలిగి ఉండడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వారికి పీవీఆర్ సినిమాస్ తరపున సినిమా టికెట్లను పంపిణీ చేశారు. కేవలం జరిమానాలు విధించడమే కాకుండా వాహనదారుల్లో అవగాహన పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ట్రాఫిక్ ఏసీపీ గోవర్దన్ తెలిపారు. పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్‌లో కూడా పలువురు వాహనదారులకు సినిమా టికెట్లను అందజేశారు.
 

Related Posts