“అహ నా పెళ్ళంట”లో రాజేంద్రప్రసాద్‌ను ఫాలో అవుతున్న పాయల్..

ఈ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో ప

“అహ నా పెళ్ళంట”లో రాజేంద్రప్రసాద్‌ను ఫాలో అవుతున్న పాయల్..

ఈ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా త‌న క్రియేటివ్ డ్రెస్సింగ్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌లే పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన పాయ‌ల్‌..లేటెస్ట్‌గా పేప‌ర్ డ్రెస్‌ కనిపెట్టేసింది.

హాస్య బ్రహ్మ జంధ్యాల రూపొందించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమా ‘అహ నా పెళ్లంట’లో డబ్బులు ఆదా చేయడం కోసం రాజేంద్రప్రసాద్ న్యూస్ పేపర్‌ను మడిచి లుంగీలాగ కట్టుకుంటాడు. ఇప్పుడు  హీరోయిన్ పాయల్ కూడా ఆ ఫ్యాషన్‌ను ఫాలో అయిపోయింది. న్యూప్‌పేప‌ర్స్‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొంద‌రు పాయ‌ల్ క్రియేటివిని పొగుడుతుంటే మ‌రొకొంద‌రు మాత్రం పాయ‌ల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు. పిల్లో డ్రెస్‌, పేప‌ర్ డ్రెస్‌.. మ‌రి తర్వాత ఎలాంటి క్రియేటివ్ డ్రెస్‌ కనిపెడుతోందో.. అని కొందరు.. ఈ ఛాలెంజ్‌ను మిగతా హీరోయిన్లకు కూడా విసిరితే భలే ఉండేది కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.