మేం పిచ్చోళ్లమా?.. సూర్య సినిమాలు బ్యాన్!

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్ అయిన నేపథ్యంలో సినిమా రిలజులు ఆగిపోయాయి.

మేం పిచ్చోళ్లమా?.. సూర్య సినిమాలు బ్యాన్!

తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్ అయిన నేపథ్యంలో సినిమా రిలజులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్తో కొన్ని సినిమాలకు అమేజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త, సూర్య నిర్మించిన చిత్రం ‘పొన్మగల్ వంధాల్’.

ఈ సినిమాను డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం. ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వం’ అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. మరి సూర్య ‘పొన్మగల్ వంధాల్’ చిత్రం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.