స్వాతి నాయుడు సీమంతం.. ఇప్పుడు మందు మానేశా.. డెలివరీ తర్వాత కూడా వీడియోలు చేస్తా..

స్వాతి నాయుడు సీమంతం సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది..

స్వాతి నాయుడు సీమంతం.. ఇప్పుడు మందు మానేశా.. డెలివరీ తర్వాత కూడా వీడియోలు చేస్తా..

స్వాతి నాయుడు సీమంతం సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది..

స్వాతి నాయుడు.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. ఈమె హాట్ వీడియోలు, టీవీ ఛానెల్స్‌లో ఈమె ఇచ్చే సలహాలు బాగా పాపులర్ అయ్యాయి. టాలీవుడ్ పోర్న్‌స్టార్, తెలుగు తెలిసిన సన్నీలియోన్.. ఇలాంటి బిరుదులు కూడా ఇచ్చేశారు స్వాతికి ఆమె ఫ్యాన్స్. ఇటీవల ఎప్పటినుండో డేటింగ్ చేస్తున్న తన స్నేహితుణ్ణి వివాహం చేసుకుంది స్వాతి.

Swathi Naidu

ప్రస్తుతం ఆమె గర్భవతి. తాజాగా స్వాతి నాయుడు సీమంతం ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ‘‘పెళ్లి తర్వాత హనీమూన్‌కి మూడు సార్లు గోవా వెళ్లాం.. వెళ్లినప్పుడల్లా పది రోజులు ట్రిప్ వేసేవాళ్లం. అప్పుడు డ్రింక్ చేసేదాన్ని. ఇప్పుడు డాక్టర్ సలహా మేరకు తాగడం మానేశాను. ప్రస్తుతం నాకు ఎనిమిదో నెల. డెలివరీ తర్వాత కొద్ది రోజులు ఫిట్‌నెస్‌‌పై దృష్టి పెడతా.. ఆ తర్వాత నా కెరీర్ కంటిన్యూ చేస్తా. నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను బేబిని కనిస్తే, నన్ను చూసుకున్నట్టే అపురూపంగా చూసుకుంటాడు. సో, హ్యాపీగా నేను నా కెరీర్ కొనసాగిస్తా’’ అని చెప్పుకొచ్చింది స్వాతి నాయుడు.
Swathi Naidu