RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్‌లో ఏకంగా 400 మంది డ్యాన్సర్లతో....

RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
ad

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్‌లో ఏకంగా 400 మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు శంకర్ చాలా ప్రెస్టీజియస్ మూవీగా తీసుకున్నాడు. అందుకే ఆయన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.

RC15: చరణ్ కన్నా విజయ్‌కే దిల్‌రాజు ప్రిఫరెన్స్.. ప్లాన్ చేంజ్ ఎందుకిలా?

ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోయిజాన్ని నెక్ట్స్ లెవెల్‌లో ఎలివేట్ చేసేందుకు శంకర్ తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగా చరణ్ ఎంట్రీ సీన్‌ను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ చాలా పవర్‌ఫుల్ సీన్‌తో ఉంటుందని.. ఈ సీక్వెన్స్ కోసం శంకర్ ఏకంగా రూ.10 కోట్ల బడ్జెట్‌ను వాడినట్లుగా తెలుస్తోంది. అంటే.. రామ్ చరణ్ ఎంట్రీ సీక్వెన్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే శంకర్ సినిమా అంటే భారీతనానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా హీరో ఎంట్రీకే పది కోట్ల బడ్జెట్ అంటే, ఈ సినిమాలో చరణ్‌ను ఎలా చూపించబోతున్నాడో అభిమానుల ఊహలకే వదిలేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ స్వామి, ఎస్.జె.సూర్య, సురేష్ గోపీ, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.