Salman Khan : ముగ్గురు హీరోలు.. 10 మంది హీరోయిన్లు.. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ ప్రయోగం

సల్మాన్ ఖాన్ హీరోగా 2005లో వచ్చిన 'నో ఎంట్రీ' సినిమా రొమాంటిక్ కామెడీగా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ కూడా హీరోలుగా చేశారు.

Salman Khan : ముగ్గురు హీరోలు.. 10 మంది హీరోయిన్లు.. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ ప్రయోగం

No Entry

Salman Khan :  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘కబీ ఈద్ కబీ దివాళీ’, ‘టైగర్‌ 3’, ‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌, తెలుగులో మెగాస్టార్ నటించే ‘గాడ్ ఫాదర్’ తోపాటు ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా 2005లో వచ్చిన ‘నో ఎంట్రీ’ సినిమా రొమాంటిక్ కామెడీగా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ కూడా హీరోలుగా చేశారు. ఈ సినిమాకి అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించారు.

Samantha : ప్రేమికుల్ని విడదీసే నెగిటివ్ రోల్‌లో సమంత

తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ‘నో ఎంట్రీ 2’ సినిమాని కూడా ఇదే హీరోలతో చేయనున్నాడు అనీస్‌ బజ్మీ. ఈ సీక్వెల్ లో సల్మాన్ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్ ముగ్గురు మూడు పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం. అంటే మొత్తం 9 పాత్రల్లో హీరోలు కనపడనున్నారు. దీంతో ఈ 9 పాత్రలకు 9 మంది హీరోయిన్లను తీసుకోబోతున్నారు. వీటితో పాటు మరో ముఖ్య పాత్రకు ఫేమ్ ఉన్న ఓ హీరోయిన్ ని తీసుకోబోతున్నారట. దీంతో ఈ సినిమాలో ఏకంగా 10 మంది హీరోయిన్లు నటించనున్నారు.

అయితే ఈ సినిమా మొదలవ్వడానికి టైం పట్టనుంది. ప్రస్తుతం సల్మాన్ మొదలు పెట్టిన రెండు సినిమాల షూట్స్, ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూట్ అయ్యాకే ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని సమాచారం.