ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన మెగా మేనల్లుడు..

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు… మొదటి వారం రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన మెగా మేనల్లుడు..

Uppena 100 Crore Gross: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు… మొదటి వారం రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఈ మూవీకి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రశంసలు లభిస్తున్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఉప్పెన’ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూశారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకుడు బుచ్చి బాబును ప్రత్యేకంగా అభినందించారు.

Uppena

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ పలుమార్లు ఈ సినిమా వంద కోట్ల సినిమా అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట నిజమైంది. విజయంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టిన‘ఉప్పెన’ రీసెంట్‌‌గా రూ. వంద కోట్ల మార్క్ టచ్ చేసింది. ‘ఉప్పెనంత మీప్రేమకి ధన్యవాదాలు’ అంటూ తమ చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించిందని అధికారికంగా తెలియజేశారు మేకర్స్.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది కనీ వినీ ఎరుగని రికార్డ్.. ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కానీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు మెగా మేనల్లుడు.. ఇకముందు ఏ కొత్త హీరో అయినా ఈ రికార్డ్‌ని బీట్ చెయ్యడం అనేది అసాధ్యం అన్నంత హై రేంజులో ‘ఉప్పెన’ భారీ రికార్డ్ సెట్ చేసింది.

Uppena 100 Crore Gross