Vikki – Katrina : విక్కీ – కత్రినా పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల డీల్..!

తాజాగా కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ వివాహాన్ని స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ట్రై చేస్తుందని సమాచారం. ఇప్పటి వరకు వీళ్ళ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలు కాని వీడియోలు...

Vikki – Katrina : విక్కీ – కత్రినా పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల డీల్..!

Vikki Katrina

Vikki – Katrina :  బాలీవుడ్ లో ఇటీవల పెళ్లిళ్లు ఎక్కువవుతున్నాయి. ఇన్నాళ్లు ప్రేమికులుగా ఉన్న బాలీవుడ్ నటీనటులు ఇటీవల ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న జంట విక్కీ కత్రీనా. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై అనేక వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఇప్పుడంతా వీళ్ళ పెళ్లి గురించే చర్చ నడుస్తుంది. కానీ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ లు మాత్రం దీనిపై స్పందించట్లేదు. ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వట్లేదు.

Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు

తాజాగా కత్రీనా కైఫ్‌, విక్కీ కౌశల్‌ వివాహాన్ని స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ట్రై చేస్తుందని సమాచారం. ఇప్పటి వరకు వీళ్ళ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలు కాని వీడియోలు కానీ ఒక్కటి కూడా బయటకి రాలేదు. బాలీవుడ్ లో కత్రీనాకు మంచి డిమాండ్ ఉంది, విక్కీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. దీంతో వీళ్ళ పెళ్లిని బిజినెస్ చేసుకోవాలనే ప్లాన్ లో కొంతమంది ఉన్నారు. అందుకోసమే వీళ్ళ పెళ్లిని ఓటిటిలో లైవ్ స్ట్రీమ్ చేయాలని కొన్ని ఓటిటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఓ ఓటిటి సంస్థ ఏకంగా 100 కోట్ల డీల్ ని విక్కీ కత్రీనాలకు ఆఫర్ చేసినట్టు సమాచారం.

Kamal Hassan : కమల్‌హాసన్‌పై సీరియస్.. స్టాలిన్ సర్కార్ నోటీసులు

వీరి పెళ్లిపై ఇంత భారీ పెట్టుబడి పెడుతుండటంతో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కటి కూడా బయటకి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. వీరి వివాహానికి ఫోన్స్ కి ఎంట్రీ లేదంట. ఈ విషయాన్ని ఇటీవల ఓ బాలీవుడ్ హీరో ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టాడు. ఈ వివాహం రాజస్థాన్ లో ఓ ప్యాలెస్ లో జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో కూడా బయటకు లీక్‌ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోయినా ప్రస్తుతం దేశమంతటా విక్కీ కత్రీనాల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.