నీ థియేటర్‌ల నా బొమ్మ : ఇస్మార్ట్ 100 డేస్

జూలై 18న విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. అక్టోబర్ 25 నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది..

  • Published By: sekhar ,Published On : October 25, 2019 / 05:40 AM IST
నీ థియేటర్‌ల నా బొమ్మ : ఇస్మార్ట్ 100 డేస్

జూలై 18న విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. అక్టోబర్ 25 నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది..

‘ఇస్మార్ట్ శంకర్’.. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ)..  నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా జూలై 18న విడుదలై.. పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.

అక్టోబర్ 25 నాటికి ‘ఇస్మార్ట్ శంకర్’ 100 రోజులు పూర్తి చేసుకుంది. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, ఛార్మీ నిర్మించారు. పూరీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర, తెలంగాణలో మూడు రోజులపాటు ఈ సినిమాను రీ-రిలీజ్ చేశారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.

Read Also : ‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్

పూరీ, రామ్, మణిశర్మలకు ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది. ఇటీవల వీడియో సాంగ్స్ రిలీజ్ చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఛార్మీ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వె‌ల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కే అవకాశం ఉంది.