‘రాముణ్ణి కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు’.. కమల్ వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ..

తాజాగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..

  • Published By: sekhar ,Published On : May 8, 2020 / 01:10 PM IST
‘రాముణ్ణి కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు’.. కమల్ వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ..

తాజాగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..

విలక్షణ నటుడు కమల్ హాసన్, ఇటీవల ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కమల్ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘సినిమా అంటే టిక్కెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం. ఇది ఛారిటీ కాదు. త్యాగరాజ స్వామిలా తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కమల్ నుంచి క్షమాపణ కోరుతూ సంగీతకారుడు పాల్‌ఘాట్ రామ్‌ప్రసాద్ ఆన్‌లైన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌కు మద్దతుగా ఇప్పటికే 16వేల మంది సంతకాలు చేశారు. ఏం మాట్లాడాలో తెలియక కమల్ అభిమానులు సైతం మౌనంగా ఉండిపోయారు. తన వ్యాఖ్యలపై కమల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.