150 కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ ‘‘RGV’’..

శ్రీ శ్రీనివాసా క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ’..

150 కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ ‘‘RGV’’..

శ్రీ శ్రీనివాసా క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ’..

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడైన శ్రీనివాసరావు భారీ బడ్జెట్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి, శంకర్, రాంగోపాల్ వర్మ ఈ ముగ్గురు దర్శకుల స్ఫూర్తితో కథ రాసుకున్నారట దర్శకులు.

అద్భుతమైన గ్రాఫిక్స్‌తో సినిమాను నిర్మిస్తున్నట్లు, ఈ సినిమాకి ‘RGV’ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించినట్లు దర్శక నిర్మాత  శ్రీనివాస్ రావు తెలియచేశారు. ఈ ముగ్గురు అగ్ర దర్శకులు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తారట.

లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ భారీ బడ్జెట్ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియ చేస్తామని, చిత్ర పరిశ్రమలో సంపాదించిన అనుభవంతో, ప్రముఖులు సూచనలతో సినిమాను భారీ వ్యయంతో, పేరొందిన నటీనటులతో తెరకెక్కిస్తామని చెప్పారు.

RGV

RGV