The warrior : రామ్ కోసం.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్..

తాజాగా ఈ సినిమాలో రామ్ ఎంట్రీకి ఒక మాస్ సాంగ్ డిజైన్ చేశారు. శేఖర్ మాస్టర్‌ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్‌.................

The warrior : రామ్ కోసం.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్..

Ram

The warrior :   రామ్, కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మొదటి సారి రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ రిలీజ్ అయి మంచి టాక్ ని తెచ్చుకున్నాయి. ది వారియర్ సినిమాని తమిళ్, తెలుగు భాషల్లో జులై 14న రిలీజ్ చేయనున్నారు.

Singeetham Srinivasarao : చిత్ర పరిశ్రమలో విషాదం.. లెజెండరీ డైరెక్టర్ సతీమణి కన్నుమూత..

తాజాగా ఈ సినిమాలో రామ్ ఎంట్రీకి ఒక మాస్ సాంగ్ డిజైన్ చేశారు. శేఖర్ మాస్టర్‌ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మాస్ సాంగ్ ని షూట్‌ చేశారు. మొదటి సారి ఇంతమందిని ఓ సాంగ్ లో వాడటం. ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో ఇంట్రో సాంగ్ కి 100 మంది డ్యాన్సర్లను వాడారు. ఈ సినిమాలో రామ్ కోసం 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్ తో డ్యాన్స్ చేయించి సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారంతో ఈ పాట షూట్ ముగియగా సినిమా షూటింగ్‌ కూడా మొత్తం పూర్తయింది. రామ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.