18 Pages Movie: 18 పేజీస్ నుంచి మూడో సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల ‘కార్తికేయ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నిఖిల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

18 Pages Movie: 18 పేజీస్ నుంచి మూడో సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్

18 Pages Movie Third Single To Be Out On This Date

18 Pages Movie: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల ‘కార్తికేయ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నిఖిల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తుండగా పూర్తి రొమాంటిక్ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

18 Pages : లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌ని ఆకట్టుకునేలా.. ‘టైం ఇవ్వు పిల్ల’ సాంగ్ లిరిక్స్..

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియోను డిసెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

18 Pages: ‘టైమ్ ఇవ్వు పిల్ల’ అంటూ శింబు చితక్కొట్టేందుకు రెడీ అయ్యాడుగా!

ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, అందాల బామ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.