ఎవర్ గ్రీన్ : నరసింహకు 20 ఏళ్లు

నరసింహ.. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ. తరాలు మారినా ఈ సినిమా ఎవరూ మర్చిపోలేరు.

10TV Telugu News

నరసింహ.. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ. తరాలు మారినా ఈ సినిమా ఎవరూ మర్చిపోలేరు.

నరసింహ.. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ. తరాలు మారినా ఈ సినిమా ఎవరూ మర్చిపోలేరు. ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. కథ, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాల్లో నరసింహ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా ఇది. ఏప్రిల్ 9, 1999 లో విడుదలైంది. తమిళ సినిమా ”పడయప్పా” కు అనువాదమే నరసింహ. రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటించారు. ఏప్రిల్ 9, 2019కి నరసింహ సినిమాకు 20 ఏళ్లు.
Read Also : రాజమండ్రిలో దీపిక ఓటుకు.. కాజల్ ఫొటో

నరసింహ పాత్రలో రజనీకాంత్ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయన స్టైల్, మేనరిజమ్, డైలాగులు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ‘నా దారి.. రహదారి!’.. అంటూ ‘నరసింహ’లో రజనీకాంత్‌ పలికిన పంచ్‌ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. ”అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగు పడినట్లు చరిత్రలోనే లేదు” అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. నెగిటివ్ పాత్రలో రమ్యకృష్ణ తన నట విశ్వరూపం చూపించింది. రమ్యకృష్ణ కెరీర్ లో నీలాంబరి పాత్ర ది బెస్ట్ గా నిలిచింది.

సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్. కుటుంబం కోసం రజనీకాంత్ చేసిన త్యాగం, విలువలు, కష్టించే తత్వం.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. 1995లో కెఎస్ రవికుమార్, రజనీకాంత్ కాంబోలో ముత్తు వచ్చింది. అది సూపర్ హిట్. దాని తర్వాత వీరి కాంబోలో వచ్చిన నరసింహ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నరసింహ రికార్డ్ సృష్టించింది.
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు