Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

ప్రస్తుతం పునీత్ హీరోగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఒకటి 'జేమ్స్' రెండోది 'ద్విత్వ'. 'జేమ్స్' సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

Puneeth

Puneeth Rajkumar :  పునీత్ రాజ్ కుమార్ కన్నడలో స్టార్ హీరో. కన్నడ పవర్ స్టార్ ఆయన. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టి ఎన్నో హిట్ సినిమాలతో పవర్ స్టార్ గా ఎదిగారు. ఈయన ఒక్కో సినిమా బడ్జెట్ ఈజీగా 50 కోట్లు ఉంటుంది. ఇటీవలే పునీత్ నటించిన ‘యువరత్న’ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ప్రతి సంవత్సరం కనీసం తన నుంచి రెండు సినిమాలు అయినా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు పునీత్.

Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

ప్రస్తుతం పునీత్ హీరోగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఒకటి ‘జేమ్స్’ రెండోది ‘ద్విత్వ’. ‘జేమ్స్’ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు. జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. రీసెంట్ గా కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది ఈ లోపే ఇలా జరగడంతో ఈ సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. మరో వైపు ‘ద్విత్వ’ అనే ఒక కొత్త కథతో సినిమా మొదలవ్వబోతుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 60 కోట్లకు పైనే ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జేమ్స్ షూటింగ్ అయిపోగానే డిసెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇంతలోనే పునీత్ మరణించడంతో ఆ దర్శక నిర్మాతల పరిస్థితి బాధాకరం. ఇంతే కాక ‘యువరత్న’ సినిమా చేసిన డైరెక్టర్ తోనే మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా ఇక ఆగిపోయినట్టే.

Rashmika : రష్మికతో అంతర్వేది ఆలయంలో శర్వానంద్

ఇవన్నీ పునీత్ హీరోగా నటిస్తున్న సినిమాలు. ఇవే కాక నిర్మాతగా కూడా పునీత్ సినిమాలు నిర్మిస్తారు. ఇప్పటికే నాలుగు సినిమాలని నిర్మించారు. ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ రెండింటి బడ్జెట్లు కలిపి 50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇలా వరుస ప్రణాళికలతో దాదాపు 200 కోట్లు పెట్టుబడులుగా ఉన్నాయి పునీత్ ని నమ్ముకొని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఈ సినిమాలు, ఈ సినిమాలను నమ్ముకున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.