‘అల’..నే తోపు.. వీలైతే ఆపు.. – అసలు సిసలు సంక్రాంతి విన్నర్..

2020 సంక్రాంతి విన్నర్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో'..

  • Published By: sekhar ,Published On : March 16, 2020 / 03:12 PM IST
‘అల’..నే తోపు.. వీలైతే ఆపు.. – అసలు సిసలు సంక్రాంతి విన్నర్..

2020 సంక్రాంతి విన్నర్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’..

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరిలో ఎవరిది పై చేయి.. కలెక్షన్ల పరంగా, వ్యూస్ పరంగా ప్రతీ విషయంలోనూ ఈ హీరోలిద్దరి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అసలైన సంక్రాంతి విన్నర్ అని ఒకరు, సంక్రాంతి బాక్సాఫీస్ మొగుడు అని ఇంకొకరు.. ఇలా 50 రోజుల పాటు థియేటర్లలో సందడి చేసాయి ఈ స్టార్‌ల సినిమాలు.

అయితే చివరకు బన్నీ సినిమానే టాప్ అనే మాట వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు చిత్రాలు సందడి చేయగా.. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. ఒకరోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

‘నువ్వా? నేనా?’ అంటూ సాగిన ఈ రసవత్తర పోరులో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’నే పై చేయి సాధించింది. అంతేకాదు కొన్ని చోట్ల ‘బాహుబలి -ది బిగినింగ్’ వసూళ్ళను సైతం అధిగమించింది ‘అల వైకుంఠపురములో’.  కాకపోతే, అటు మహేశ్‌కి – ఇటు బన్నీకి ఆ యా చిత్రాలు కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలవడం మాత్రం వార్తల్లో నిలిచింది.   

వసూళ్ళ విషయంలోనే కాదు… పాటల విషయంలోనూ ‘అల వైకుంఠపురములో’ సత్తా చాటింది. విడుదలకు ముందే… ‘అల…’  గీతాలకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్సాన్స్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే  ఒక్క ‘రాములో రాములా’ పాటకి వచ్చినన్ని వ్యూస్ ‘సరిలేరు నీకెవ్వరు’లోని అన్ని పాటల లిరికల్ వీడియోస్ తాలూకు వ్యూస్ కలుపుకున్నా రాలేదంటే ఆశ్చర్యమే మరి. కట్ చేస్తే ఇప్పుడదే తీరు వీడియో సాంగ్స్ విషయంలోనూ కొనసాగుతోంది.

యూట్యూబ్‌లో వారాల వ్యవధిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ వీడియో సాంగ్స్ రిలీజ్ కాగా ‘అల…’ గీతాలకే మంచి వ్యూయర్ షిప్ ఉంటోంది. మరీ ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’, ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ వీడియో సాంగ్స్‌కి భలే ఆదరణ దక్కుతోంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ విషయానికి వస్తే ‘మైండ్ బ్లాక్’, ‘డాంగ్ డాంగ్’ పాటలకు రెస్పాన్స్ బాగుంది. ఎటొచ్చి ‘అల…’గీతాలను మించిన హవా మాత్రం కొనసాగడం లేదు. మొత్తమ్మీద  బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలోనే కాదు యూట్యూబ్ రికార్డ్స్‌లోనూ సూపర్ స్టార్‌పై స్టైలిష్ స్టార్‌దే పైచేయి అని చెప్పక తప్పదు.