Mega Hero’s: మెగా నామ సంవత్సరంగా 2022.. ఫ్యాన్స్‌కు పండగే!

దాదాపు 3 ఏళ్లు.. మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ సినిమా థియేటర్ లోకివచ్చి మూడేళ్లు అయ్యింది. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి చిన్న హీరోల సినిమాలు వస్తున్నాయి ఓకే..

10TV Telugu News

Mega Hero’s: దాదాపు 3 ఏళ్లు.. మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ సినిమా థియేటర్ లోకివచ్చి మూడేళ్లు అయ్యింది. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి చిన్న హీరోల సినిమాలు వస్తున్నాయి ఓకే.. కాని మెగా తండ్రీ కొడుకుల ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా మంచి జోరు మీద ఉన్నాడు. ఇక 2022లో మెగా సినిమాల పండగ జరగబోతోంది. జనవరి మొదలు ఇయర్ ఎండ్ వరకూ మెగా మోత మోగబోతోంది.

Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

మెగా ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. 2022 మోగా బోనాంజ రాబోతోంది. ఫ్యాన్స్ మూడేళ్లుగా కళ్లు కాయలు కాచేలా చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి భారీ ట్రీట్ ను రెడీ చేస్తున్నాడు మెగా తండ్రీ కొడుకులు. కరోనా వల్ల స్లో అయిన సినిమాలు స్పీడ్ అప్ అందుకోవడంతో సినిమాల పంట పండబోతోంది. ఈ జనవరి ట్రిపుల్ ఆర్ తో స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ వరకూ మోత మోగించబోతున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019లో వినయ విధేయ రామ తరువాత చరణ్ సినిమా చేయలేదు. అప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ మీదనే దృష్టి పెట్టాడు. దీనితో పాటు సైమల్ టైనస్ గా ఆచార్య కూడా చేసుకుంటూ వచ్చాడు చరణ్. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియాను గట్టిగా టార్గెట్ చేశాడు.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

గతంలో తుఫాన్ మూవీతో ఫెయిల్ అయినా.. ఈసారి సాలిడ్ గా రాబోతున్నాడు. జనవరి 7న రిలీజ్ కాబోతుంది ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ కు 3 ఏళ్లు టైమ్ తీసుకున్న చరణ్ ఇక లేట్ చేయకుండా వరుస సినిమాల కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే శంకర్ తో భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సమ్మర్ వరకూ రిలీజ్అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ అయిపోకముందే గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు చరణ్. 2020లో ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు.

Aishwarya Rajesh: ప్యూర్ హోమ్లీ లుక్‌లో ఐశ్వర్య.. ఫోటోలు!

దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్ పవర్ స్టార్ ఈ ఏడాది ఏప్రిల్ లో వకీల్ సాబ్ తో హిట్ కొట్టారు. కరోనా కారణంగా పవన్ కల్యాణ్ అనుకున్న సినిమాలు అనుకున్నట్టు రిలీజ్ చేయలేకపోయారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ హడావిడిలో ఉన్న పవన్ జనవరి 12న రాబోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ను ఢీ కొట్టబోతున్నారు. ఇక క్రిష్ తో పవన్ చేస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు కూడా సమ్మర్ కు రెడీ అవుతోంది. ఏప్రిల్ 29న రిలీజ్ అవ్వబోతోంది. ఈరెండు కాకుండా హరీష్ శంకర్ తో భవదీయుడు భగద్ సింగ్ మూవీ చేస్తున్నారు పవర్. ఈమూవీని 2022 దసరాకు ప్లాన్ చేస్తున్నారు.

Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!

కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. నాన్ స్టాప్ గా సినిమా మీద సినిమా కమిట్ అవుతూ వాటిని సెట్స్ ఎక్కిస్తూ.. ఫుల్ బిజీ అయిపోతున్నారు. 2022 లో నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకున్నారు మెగాస్టార్. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు. మెగా కుర్ర హీరోలకు పోటీవస్తున్నాడు చిరంజీవి. రీ ఎంట్రీ నుంచి జోరు చూపిస్తున్న లెజండరీ హీరో.. కరోనా వల్ల రెండేళ్లు సినిమా ఇవ్వేలేకపోయారు. అందుకే 2022కు మెగా బోనాంజను రెడీ చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యి.. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ పిబ్రవరి 4కి చేరింది. ఇక ఆచార్యతో స్టార్ట్ చేసిన ప్రవాహం ఇయర్ ఎండ్ వరకూ కొనసాగించబోతున్నాడు చిరు. ఆచార్య రిలీజ్ అయిన వెంటనే.. మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ రిలీజ్ కు వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్పీడ్ అప్ చేశాడు స్టార్ హీరో.. మలయాళ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్.

Jr NTR: పవన్ సినిమాల్లో తారక్‌కి ఇష్టమైన సినిమా ఇదే..!

గాడ్ ఫాదర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ లో ఉంది. ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే మోహర్ రమేష్ తో భోళా శంకర్.. బాబీతో మారో మూవీ ఓపెనింగ్ చేసేశారు చిరంజీవి. ఇందులో భోళా శంకర్ ను అగస్ట్ లో తన బర్త్ డే వరకూ రిలీజ్ చేయాలిన ప్లాన్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను దసరాకు కాని.. దివాళికి కాని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నాలుగు సినిమాలతో ఆగకుండా వెంకీ కుడుముల డైరెక్షన్ లో డివివి దానయ్య నిర్మాతగా సినిమా దాదాపు కన్ ఫార్మ్ అయ్యింది. ఇవి కాకుండా పూరీ జగన్నాథ్, మారుతి, అనిల్ రావిపూడిల తో కూడా సినిమాలు లైన్ అప్ అవుతున్నట్టు తెలుస్తోంది.

Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!

అటు మెగా కుర్ర హీరోలంతా ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ నుంచి ఏ సినిమాలు వస్తాయో క్లారిటీ లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ కొత్త డైరెక్టర్ అనిల్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ గీరిషయ్యతో కొత్త సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అటు చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం 2022లో సినిమాల జాతరకు రెడీ అవుతున్నారు. ఇక ఫ్యాన్స్ కు పండగే.

×