సంక్రాంతి సమరానికి సిద్ధం..

సంక్రాంతి సమరానికి సిద్ధం..

2022 Sankranthi: టాలీవుడ్ మేకర్స్ వరుస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. టైమ్ చూసుకుని సీజన్లన్నీ బుక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సమ్మర్, దసరా, ఇయర్ ఎండ్‌కి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు స్టార్లు. మిగిలిన స్టార్ హీరోలు సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి మీద కన్నేశారు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి రేస్‌లో ఉన్న స్టార్ హీరోలెవరో, సంక్రాంతి సినిమాలేంటో చూద్దాం..

సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి సినిమాల్ని లాక్ చేసుకుంటున్నారు స్టార్లు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్స్ ఇప్పుడే బుక్ చేసేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోనే ఎప్పుడూ రానంతమంది స్టార్ హీరోలతో ముస్తాబవుతోంది. 2022 సంక్రాంతికి ఫస్ట్ ఖర్చీఫ్ వేసుకున్న హీరో బన్నీ. కొరటాల శివ డైరెక్షన్లో బన్నీ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్‌ని ఎర్లీ జనవరిలోనే రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే క్లారిటీ ఇచ్చింది టీమ్. అసలే లాస్ట్ ఇయర్ 2020 సంక్రాంతికి అన్ని సినిమాల్నీ వాషవుట్ చేసి ‘అల.. వైకుంఠపురములో’.. సినిమాతో సక్సెస్ కొట్టారు స్టైలిష్ స్టార్.

Allu Arjun

బన్నీతో పాటు పోటీ పడడానికి మరో సారి రెడీ అయ్యారు సూపర్ స్టార్. మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాని కూడా సంక్రాంతి బరిలోనే దింపుతున్నట్టు రీసెంట్‌గానే అనౌన్స్ చేశారు మహేష్ బాబు అండ్ కో. పోయిన సంవత్సరం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టారు మహేష్ బాబు.

Mahesh Babu

ఆల్రెడీ రేస్‌లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఉంటే ఈ రేస్‌ని ఇంకాస్త స్పీడప్ చెయ్యడానికి పాన్ ఇండియా స్టార్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పనుల్ని స్పీడప్ చేసిన ప్రశాంత్ నీల్.. సౌత్‌కి బాగా కలిసొస్తున్న సంక్రాంతికే ‘సలార్’ ను తీసుకురావాలని డిసైడ్ అయ్యారని టాక్.

Prabhas
ముగ్గురు టాప్ హీరోలను ఢీ కొట్టడానికి మరో స్టార్ కూడా యాడ్ అవుతున్నారు. రెండేళ్లుగా థియేటర్లోరి రాని ఎన్టీఆర్, నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి సమరానికి సై అంటున్నారు. త్రివిక్రమ్‌తో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ సమ్మర్‌లో రిలీజ్ కావల్సిన సినిమాని.. ఈ సమ్మర్‌లో స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసకురావాలని ప్లాన్లు రెడీ చేస్తున్నారు.

NTR

ఎంత మంది టాలీవుడ్ హీరోలు, పాన్ ఇండియా ప్రభాస్‌లు ఉన్నా.. పండగ హీరో నేనే అంటున్నారు బాలయ్య. ఈ నటసింహానికి సంక్రాంతి సక్సెస్ హిస్టరీ బాగానే ఉంది. అందుకే ఎంతమందొచ్చినా, ఎన్ని సినిమాలతో వచ్చినా.. సంక్రాంతి సినిమా నాదే అంటున్నారు. మలినేని గోపీచంద్ -బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నారు.

Balakrishna

నిన్న మొన్నటి వరకూ కామ్‌గా ఉన్న అక్కినేని హీరో నాగార్జున కూడా నా నెక్ట్స్ మూవీ సంక్రాంతికే అంటున్నారు. కళ్యాణ్ కృష్ణ- నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘బంగార్రాజు’ సినిమాని ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి పండగబరిలోకే దింపుతున్నారు. ‘బంగార్రాజు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి సీక్వెల్‌గా రాబోతోంది.

Nagarjuna

అసలే ఇన్ని తెలుగు సినిమాలతో పండగ ప్యాక్ అయిపోయి ఉంటే.. ఇవి సరిపోనట్టు.. తమిళ్ మూవీ ‘పొన్నియున్ సెల్వన్’ మూవీ పొంగల్‌కి మేం కూడా రెడీ అంటోంది. మణిరత్నం డైరెక్షన్‌లో ఐశ్వర్యా రాయ్, నయనతార, ‘చియాన్’ విక్రమ్, కార్తి, త్రిష.. ఇలా భారీ స్టార్ కాస్ట్‌తో హెవీగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీని కూడా త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు టీమ్. ఈ స్టార్ హీరోల టాప్ మూవీస్‌తో వచ్చే ఏడాది సంక్రాంతి సందడి పీక్స్‌కి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.

Ponniyin Selvan