ప్రభాస్-కత్రినా-అక్షయ్ కుమార్‌ల టార్గెట్ 2021.. భారీ ప్రాజెక్టులతో సిద్ధమవుతోన్న బాలీవుడ్

ప్రభాస్-కత్రినా-అక్షయ్ కుమార్‌ల టార్గెట్ 2021.. భారీ ప్రాజెక్టులతో సిద్ధమవుతోన్న బాలీవుడ్

బాలీవుడ్ సినిమాలు దాదాపు పూర్తి కానున్నాయి. ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు కరోనా సమయంలో సినిమాలు పూర్తి చేయడానికి 24గంటలూ కష్టపడుతూనే ఉన్నారు. డైరక్షన్, ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్లీ కంటెంట్ ప్రొడ్యూసింగ్, ఇళ్ల నుంచే డిజిటల్ యాడ్స్ కు రెడీ చేశారు. అంతేకాదు వచ్చే సంవత్సరం నుంచి స్ట్రాంగ్ బ్యాక్ గా తిరిగి రావాలని ప్లాన్ చేస్తూ ప్రాజెక్టులపై పకడ్బంధీ ప్లాన్ తోనే ఉన్నారు. అక్షయ్ కుమార్.. తో పాటు అటువంటి పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పేశారు మరో ఇద్దరు బడా హీరోలు. రీసెంట్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టులివే..

1. పేరు పెట్టని ప్రభాస్, దీపికా పదుకొణెల సినిమా
జులై నెలలో ప్రభాస్, దీపికా పదుకొణెల సినిమాను అనౌన్స్ చేసి ఇంటర్నెట్ షేక్ అయిపోయేలా చేశారు. ఈ సినిమాను హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తు్నారు. ప్రభాస్ కు ఇది 21వ సినిమా. ఫిల్మ్ మేకర్లు దీని పేరును గాని, స్టోరీ లైన్ ను గాని ప్రకటించలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై, నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా సిద్ధమవుతోందనే సమాచారం మాత్రమే తెలిసింది.

2. ఫోన్ బూత్ సినిమాలో కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది:
ప్రభాస్, దీపికా పదుకొనెల పేరుపెట్టని ప్రాజెక్టుతో పాటు కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ ల సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాని పేరు ఫోన్ బూత్. దానికి క్యాప్షన్ గా రింగింగ్ ఇన్ సినిమాస్ ఇన్ 2021 అంట. హర్రర్ కామెడీ నేపథ్యంలో గుర్మీత్ సింగ్ డైరక్షన్ చేస్తుండగా ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్నారు.

3. రక్షా బంధన్ సినిమాలో అక్షయ్ కుమార్:
అక్షయ్ కుమార్ ఆల్రెడ్ నాలుగు ప్రాజెక్టులు ఓకే చేసేశాడు. 2020-2021టైంలోనే ఇవన్నీ రెడీ అవనున్నాయి. రక్షా బంధన్ సినిమాను ఆగష్టు 3నే ప్రకటించారు. దాంతో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా 2021 నవంబరు 5 అని అనౌన్స్ చేసేశారు. ఈ సినిమా సందర్భంగా బ్రదర్-సిస్టర్ హార్ట్ వార్మింగ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘మీ గుండెను హత్తుకునే స్టోరీ.. నా లైఫ్ మొత్తంలో వెంటనే ఒప్పేసుకున్న సినిమా అంటే ఇదే’ అని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.