సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్.. ‘కింగ్’ ‘శివ’కి 31 ఏళ్లు..

  • Published By: sekhar ,Published On : October 5, 2020 / 06:22 PM IST
సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్.. ‘కింగ్’ ‘శివ’కి 31 ఏళ్లు..

31 Years for Trendsetter Shiva: 1989 అక్టోబర్ 5.. తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని రోజు.. ఇండియన్ సినిమాకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన Cult Classic, Industry Hit ‘శివ’ సినిమా విడుదలైన రోజు.. నటుడిగా అక్కినేని నాగార్జున స్టామినా చూపించిన సినిమా.. రామ్ గోపాల్ వర్మ అనే టాలెంటెడ్ డైరెక్టర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన సినిమా.. 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన ‘శివ’ 2020 అక్టోబర్ 5 నాటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

నాగార్జున, అమల జంటగా.. వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అన్నపూర్ణ స్టూడియోస్, యస్.యస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘శివ’ రిలీజ్ నాడు మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు, సినీ వర్గాల వారు షాక్ అయ్యారు. తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ చూడని ఓ సరికొత్త.. డేరింగ్ అండ్ డాషింగ్ అటెంప్ట్ ‘శివ’..

నాగార్జున సైకిల్ చైన్ లాగి హీరోయిజానికి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు.. దర్శకత్వంలో ఇదో కొత్త శైలి.. ఎవరీ రామ్ గోపాల్ వర్మ! అంటూ.. సినీ పెద్దలు ఆరా తియ్యడం మొదలెట్టారు. బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్.. థియేటర్లు పెరిగాయి.. కట్ చేస్తే.. ఏ సినిమా కూడా దరిదాపులకు చేరుకోలేని బాక్సాఫీస్ రికార్డులు ‘శివ’ సొంతమయ్యాయి.

సౌండ్‌కు తెలుగు సినిమాలో మరింత ప్రాధాన్యతను పెంచిన చిత్రమిది. మేస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికే సెన్సేషనే.. సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాల్‌ రెడ్డి విజువల్స్ సరికొత్తగా చూపించారు. ఈ చిత్రంతో నాగార్జున అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదింకున్నారు నాగ్.
https://10tv.in/music-director-sandeep-chowta-sent-special-gift-for-king-nagarjuna

విజయవాడలో చదువుకున్న రామ్‌గోపాల్‌ వర్మ తన కాలేజీ లైఫ్‌లో చూసిన, విన్న కాలేజీ గొడవలను ఆధారంగా చేసుకుని ‘శివ’ చిత్రాన్ని తెరకెక్కించారు. 55 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశారు. ఇందులో మూడు రోజులు మాత్రమే చెన్నైలో చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్‌ అంతా తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది.

22 సెంటర్స్‌లో శత దినోత్సవాన్ని, ఐదు సెంటర్స్‌లో సిల్వర్‌ జూబ్లీని జరుపుకుందీ చిత్రం. పలు అంతర్జాతీయ చిత్రత్సవాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి బెస్ట్‌ మూవీగా ఫిలింఫేర్‌ అవార్డ్‌తో పాటు బెస్ట్‌ ఫస్ట్‌ ఫిలిం, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ డైలాగ్స్ కేటగిరీల్లో సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి.

‘శివ’ సినిమా అనగానే నాగార్జునతో పాటు విలన్‌గా నటించిన రఘువరన్, అమల పాత్రలు గుర్తుకు వస్తాయి. ‘శివ’ సినిమా ఫైట్స్‌, సౌండ్‌, పాటలను మనమింకా మరచిపోలేదంటే.. ఆ సినిమా చూపిన ఇంపాక్ట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని 1990లో హిందీలో రీమేక్‌ చేస్తే.. అక్కడ కూడా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది.

తెలుగు సినిమా ‘శివ’ కు ముందు ‘శివ’ కు తర్వాత అనేట్టుగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ‘శివ’ మూవీ. టైటిల్ లేకుండా 100 రోజుల పోస్టర్ పడిన సినిమా ‘శివ’ నే. 31 సంవత్సరాలే కాదు.. ఎన్నేళ్లైనా ‘శివ’ ఇంపాక్ట్ ఇంచు కూడా తగ్గదు అన్నది వాస్తవం. అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ లేనిదే ‘శివ’ సినిమా లేదు. ‘శివ’ లేనిదే తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అనే మాట కూడా లేదన్నది వాస్తవం..

Shiva Shiva Shiva

Shiva

SHIVA SHIVA SHIVA SHIVA