40 వసంతాల శంకరాభరణం

శంకరాభరణం, 1980వ సంవత్సరం, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. 2019 ఫిబ్రవరి 2 నాటికి దిగ్విజయంగా 39 వసంతాలు పూర్తి చేసుకుని, 40 వ వసంతంలోకి అడుగు పెడుతుంది.

  • Published By: sekhar ,Published On : February 2, 2019 / 12:28 PM IST
40 వసంతాల శంకరాభరణం

శంకరాభరణం, 1980వ సంవత్సరం, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. 2019 ఫిబ్రవరి 2 నాటికి దిగ్విజయంగా 39 వసంతాలు పూర్తి చేసుకుని, 40 వ వసంతంలోకి అడుగు పెడుతుంది.

కమర్షియల్ సినిమాలకి అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు కొండంత ఊరటనిస్తూ, వారి మనసులని హత్తుకున్న సినిమా, శంకరాభరణం.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా చాటిచెప్పిన అద్భుతమైన కళాఖండం, తెలుగు సినిమా క్లాసిక్.. శంకరాభరణం.. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై, ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన శంకరాభరణం, 1980వ సంవత్సరం, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. 2019 ఫిబ్రవరి 2 నాటికి దిగ్విజయంగా 39 వసంతాలు పూర్తి చేసుకుని, 40 వ వసంతంలోకి అడుగు పెడుతుంది. రిలీజ్ అయిన కొత్తలో ప్రేక్షకులు  ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపించలేదు..

మౌత్ టాక్‌తో మెల్లగా పుంజుకుని, ప్రేక్షకుల రివార్డులతో పాటు పలు అవార్డులు కూడా అందుకుంది. శంకరాభరణం శంకర శాస్త్రిగా జె.వి.సోమయాజులు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసారు. మంజు భార్గవి, చంద్ర మోహన్, రాజలక్ష్మీ, అల్లు రామలింగయ్య, తులసి, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి తదితరులంతా తమ తమ పాత్రల్లో జీవించేసారు. కె.వి.మహదేవన్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. శంకరా నాద శరీరాపరా, ఓంకార నాదాను, దొరుకునా ఇటువంటి సేవ, రాగం తానం పల్లవి, సామజ వరగమన వంటి పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శంకరాభరణంది ప్రత్యేక స్థానం..