5 Indians Oscar : ఆస్కార్ గెలిచిన 5 భారతీయులు : దేశీయ తొలి అవార్డు ఎవరిదో తెలుసా?

ప్రతి ఏడాదిలో అందించే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులు.. 93వ అకాడమీ అవార్డుల జాబితాతో సహా మొత్తంగా ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఐదుగురు భారతీయులు ఉన్నారు. వారు ఎవరెవరో చూద్దాం..

5 Indians Oscar : ఆస్కార్ గెలిచిన 5 భారతీయులు : దేశీయ తొలి అవార్డు ఎవరిదో తెలుసా?

5 Indians Who Won The Oscar, Who India's First Oscar

5 Indians who won the Oscar : ప్రతి ఏడాదిలో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు అందించే ప్రతిష్ఠాత్మక అవార్డులు… అదే అకాడమీ (ఆస్కార్) అవార్డులు.. 1957లో మెహబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’ ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అధికారికంగా నామినేట్ అయింది. అప్పటి నుండి, లగాన్ , సలాం బొంబాయి వంటి సినిమాలు కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఎంపికయ్యాయి.

ఏ భారతీయ సినిమా ఆస్కార్ అవార్డును ఇప్పటివరకూ గెలుచుకోలేదు. కానీ, ఆస్కార్ గెల్చుకున్న ప్రముఖులు ఉన్నారు. మ్యూజిక్ కంపోజర్ ఎఆర్ రెహమాన్‌కు కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయ్య, ఆస్కార్ గెల్చుకున్న అతికొద్దిమంది భారతీయుల్లో ఉన్నారు. 93వ అకాడమీ అవార్డుల జాబితాతో సహా మొత్తంగా ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఐదుగురు భారతీయులు ఉన్నారు. వారు ఎవరెవరో చూద్దాం..

1. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – Bhanu Athaiya :
భాను అతయా.. పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్.. భారతీయ మొట్టమొదటి ఆస్కార్ అవార్డు విజేత.. 1982లో చారిత్రక డ్రామా మూవీ గాంధీలో అతియా నటించారు. దాదాపు 100 మూవీలకు పనిచేశారు. గురుదత్త్, యాశ్ చోప్రా, రాజ్ కపూర్, బీఆర్ చోప్రా, విజయ్ ఆనంద్, రాజ్ ఖోస్లా అశుతోష్ గౌరికర్ పలువురు సినీ ప్రముఖులతో పనిచేశారు. విదేశీ సినీ ప్రముఖులైన కాన్రాడ్ రూక్స్, రిచర్డ్ అటెన్ బరోలతో కూడా పనిచేశారు.

Athaiya

2. హానరీ అవార్డ్ – Satyajit Ray :
విప్లమాత్మక సినీదర్శకులు సత్యజిత్ రాయ్.. భారతీయ, బెంగాలీ సినిమాల్లో లెజండరీ ఫిల్మ్ మేకర్ గా ప్రభంజనం సృష్టించారు. పాథర్ పంచాలీ ఈయన మొదటి సినిమా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. 1955లో కెన్నస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ హ్యుమన్ డాక్యుమెంట్ కూడా అవార్డు లభించింది. 1992లో అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్స్, సైన్సెన్స్ అవార్డులను కూడా రాయ్ సొంతం చేసుకున్నారు. హానరీ ఆస్కార్ 1992 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును గెల్చుకున్నారు.

Ray

3. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ – Resul Pookutty
భారతీయ సినిమా టాలెంట్‌ను విదేశాల్లోనూ గుర్తింపును తీసుకొచ్చిన మూవీ.. స్లమ్ డాగ్ మిలియనీర్.. బెస్ట్ ఫిక్చర్స్ కింద ఈ మూవీ ఆస్కార్ అవార్డు గెల్చుకుంది. సౌండ్ ఇంజనీర్ Resul Pookutty.. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ లో భారత్ గర్వించదగిన వ్యక్తిగా నిలిచారు. 81వ ఆస్కార్ అవార్డుల్లో విజేతగా నిలిచారు. ఐయాన్ టాప్, రిచర్డ్ ప్రైకేలకు కూడా ఆస్కార్ అవార్డు పొందారు. తనకు వచ్చిన ఆస్కార్ అవార్డును ఓ.. అంటూ రషూల్ భారతదేశానికి అంకితం చేశారు.

Jay

4. ఎ.ఆర్ రహమాన్ :
81వ ఆస్కార్ అవార్డుల్లో డానీ బోయెల్ స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా సంగీత మాంత్రికుడు ఎ.ఆర్ రహమాన్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు. బ్రిటీష్ ఇండియన్ మూవీకి మూడు క్యాటగిరీలలో ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఫస్ట్ ఇండియన్ కూడా ఇతడే.. ఒరిజినల్ స్కోరు, ట్రాక్.. జయహో.. రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్నారు. గతంలో బెస్ట్ ఒరిజినల్ స్కోరు కేటగిరీలో 127 అవర్స్, ఇఫ్ ఐ రైజ్ అనే మూవీలకు కూడా ఆస్కార్ కు నామినేట్ అయ్యారు రెహమాన్…

Ar

5. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. గుల్జర్ :
సాంగ్.. జయహో.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది అప్పట్లో.. ఎఆర్ రెహమాన్ ఈ పాట కంపోజ్ చేశారు. ఇందుకు ఆయనకు రెండో ఆస్కార్ తెచ్చిపెట్టింది. ఈ పాటకు ప్రముఖ లిరికిస్ట్ గుల్జర్ లిరిక్స్ రాశారు.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గుల్జర్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు.

Guljar