777 Charlie : కుక్క మీద తీసిన సినిమా.. లాభాల్లో 5 శాతం కుక్కలకే..
777 చార్లీ సినిమా రిలీజ్ అయి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో హీరో రక్షిత్ శెట్టి, చిత్ర యూనిట్ తో కలిసి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్స్..............

777 Charlie
777 Charlie : కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవల 777 చార్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కన్నడతో పాటు పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో విడుదలైంది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేశారు. 777 చార్లీ సినిమా మంచి విజయం సాధించింది. పెట్ లవర్స్ ఈ సినిమాని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. హీరో జీవితంలోకి చార్లీ అనే కుక్క ప్రవేశించి అతన్ని, అతని జీవితాన్నిఎలా మార్చేసిందనే కథాంశంతో తెరకెక్కిన 777 చార్లీ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.
Sai Kumar : నటుడిగా 50 ఏళ్ళు.. పోలీస్ స్టోరీ మరో సీక్వెల్ త్వరలో..
777 చార్లీ సినిమా రిలీజ్ అయి 25 రోజులు పూర్తి చేసుకోవడంతో హీరో రక్షిత్ శెట్టి, చిత్ర యూనిట్ తో కలిసి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దీంతో సినిమాకు వచ్చిన లాభాల్లో 5 శాతం ఈ సినిమాలో నటించిన కుక్క చార్లీ పేరు మీద డాగ్స్, జంతువుల సంక్షేమం కోసం పనిచేసే ఎన్జీవోలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశారు. మూగ జీవాల సంక్షేమం కోసం రక్షిత్ శెట్టి అండ్ టీం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.
Faith and gratitude has made this day possible! Reveling in 25 days of your love?#777Charlie @Kiranraj61 @PrithviOfficial @karthiksubbaraj @RanaDaggubati @RajbShettyOMK @sangeethaSring @actorsimha @DanishSait @nobinpaul @pratheek_dbf @ParamvahStudios pic.twitter.com/1LoWBCF9E2
— Rakshit Shetty (@rakshitshetty) July 4, 2022