సోషల్ మీడియాలో కొత్త మార్క్ టచ్ చేసిన కింగ్

కింగ్ అక్కినేని నాగార్జున ట్విట్టర్‌లో 6 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు..

  • Published By: sekhar ,Published On : June 17, 2020 / 11:32 AM IST
సోషల్ మీడియాలో కొత్త మార్క్ టచ్ చేసిన కింగ్

కింగ్ అక్కినేని నాగార్జున ట్విట్టర్‌లో 6 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు..

సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారాయన. తాజాగా నాగార్జున ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది.

ఈ సందర్భంగా నాగార్జున తన అభిమానులకు మరియు ట్విట్టర్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. నాగ్ ప్రస్తుతం కొత్త దర్శకుడు సాల్మోన్‌తో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. మరోవైపు ‘బంగార్రాజు’ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆధ్వర్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం.

Read: అక్కడికంటే ముందు ఇక్కడే ‘నో టైం టు డై’