Rohit : ‘6 టీన్స్’ హీరో మళ్లీ వస్తున్నాడు..

‘6 టీన్స్‌’, ‘జానకి వెడ్స్‌ శ్రీరామ్‌’, ‘నేను సీతామాలక్ష్మి’, ‘శంక‌ర్‌దాదా MBBS’, ‘సొంతం’, ‘నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు..

Rohit : ‘6 టీన్స్’ హీరో మళ్లీ వస్తున్నాడు..

Rohit

Rohit: ‘6 టీన్స్‌’, ‘జానకి వెడ్స్‌ శ్రీరామ్‌’, ‘నేను సీతామాలక్ష్మి’, ‘శంక‌ర్‌దాదా MBBS’, ‘సొంతం’, ‘నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కళాకార్‌’. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ మూవీలో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివ శంకర్‌, రవి కాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌ కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సీనియర్ హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. ‘‘ఫ‌స్ట్ ‘క‌ళాకార్’ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫ‌స్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. వెంక‌ట‌రెడ్డి గారు నిర్మాత‌గా శ్రీ‌ను బందెల డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్‌గా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. రోహిత్ నేను క‌లిసి ఎప్ప‌టినుండో ఇండ‌స్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆయ‌న మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్‌’’ అన్నారు.

Kalakaar

హీరో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క‌ళాకార్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ హీరో శ్రీ‌కాంత్ గారు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎప్ప‌టినుంచో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ఫస్ట్‌ టైమ్‌ యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ స‌బ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్ర‌మిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. సినిమా చాలా బాగా వచ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి న‌చ్చుతుంది’’ అని అన్నారు.

Kalakaar

నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ.. ‘కళాకార్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌చేసిన హీరో శ్రీ‌కాంత్‌ గారికి ధ‌న్య‌వాదాలు. హీరో రోహిత్‌కు ప‌ర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ స‌బ్జెక్ట్ ఇది. మంచి క‌థ-క‌థ‌నం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌ తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీలో రోహిత్ ఒక డిఫ‌రెంట్ లుక్‌లో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ‘కళాకార్’ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వ‌చ్చింది’’ అన్నారు.

Kalakaar