67th National Film Awards : జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం “జెర్సీ”..ఉత్తమ నటులు ధనుష్,మనోజ్ బాజ్ పాయ్..ఉత్తమ నటి కంగనా

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ సినిమా(తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది.

67th National Film Awards : జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం “జెర్సీ”..ఉత్తమ నటులు ధనుష్,మనోజ్ బాజ్ పాయ్..ఉత్తమ నటి కంగనా

Award

Film Awards 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ సినిమా(తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు.

తెలుగులో ఉత్తమ పాపులర్ చిత్రంగా మహేష్ బాబు నటించిన “మహర్షి”అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, తమిళంలో ఉత్తమ చిత్రంగా ధనుష్‌ నటించిన `అసురన్‌` ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధానపాత్రలో నటించిన “చిచోరే”నిలిచింది. నాన్ ఫీచర్ విభాగంలో తెలుగు సినిమాలకు చోటు దక్కలేదు. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు.

ఇక, జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణికర్ణిక) నిలిచింది. ఉత్తమ జాతీయ నటులుగా ధనుష్(అసురన్),మనోజ్ భాజ్ పాయ్(భోంస్లే)అవార్డులను దక్కించుకున్నారు. ఇక, ఉత్తమ సినిమాటోగ్రఫీ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్(మేల్) అవార్డు బి ప్రాక్ కు దక్కింది. హిందీ సినిమా “కేసరి” లోని “తేరి మిట్టి”పాటకు బి ప్రాక్ కు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు దక్కింది.