7 ట్రైలర్ : వాడు కార్తీకా- కృష్ణమూర్తా?

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 7 (సెవెన్) మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

10TV Telugu News

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 7 (సెవెన్) మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

హవీష్, రెహమాన్, నందితా శ్వేత, రెజీనా, అతిథి ఆర్య, అనీషా అంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కుతున్న సినిమా, 7 (సెవెన్).. రమేష్ వర్మ స్టోరీ, స్ర్కీన్‌ప్లే అందిస్తూ, నిర్మిస్తుండగా, నిజార్ షఫీ ఫోటోగ్రఫీతో పాటు, డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.

‘ప్రేమ, పెళ్ళి పేరుతో పలువురు యువతులను మోసం చేసి పారిపోయిన కార్తీక్ అనే యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు’.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన 7 ట్రైలర్, పోలీస్ ఆఫీసర్ రెహమాన్, కార్తీక్ కోసం చేసే ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా సాగుతుంది.. కార్తీక్ కోసం వెతుకుతున్న పోలీసులకు అతను కార్తీక్ కాదు, కృష్ణమూర్తి అని తెలియడం, పోలీసులు షాకవడం, కార్తీక్ దొరికినట్టే దొరికి ఎస్కేప్ అవడం.. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. 

‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం.. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉండడమే కాక, ప్రతీ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.. ప్రతీ ట్విస్ట్ వెనుక కథలో భాగంగానే ఎమోషనల్ లవ్‌స్టోరీ ఉంటుంది.. ఆరుగురు అమ్మాయిలు, ఆరు ప్రేమ కథలు.. ప్రతీ ప్రేమ కథలోనూ ఒక్కడే అబ్బాయి.. అదెలా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.. అంటున్నాడు దర్శకుడు.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న7 మూవీ, ఈద్ కానుకగా జూన్ 5న రిలీజ్ కానుంది.

ఏడిద శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ధనరాజ్, సత్య, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : చైతన్ భరద్వాజ్, కెమెరా : సతీష్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, డైలాగ్స్ : మహర్షి, లిరిక్స్ : శ్రీమణి, పులగం చిన్నారాయణ, ఫైట్స్ : వెంకట్ మహేష్, ఆర్ట్ : గాంధీ.

వాచ్ 7 ట్రైలర్..

10TV Telugu News