ఏడేళ్లనాటి ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఎప్పటికీ మర్చిపోలేం.. మెమొరీస్ షేర్ చేసిన దీపికా..

  • Published By: sekhar ,Published On : August 10, 2020 / 03:58 PM IST
ఏడేళ్లనాటి ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఎప్పటికీ మర్చిపోలేం..  మెమొరీస్ షేర్ చేసిన దీపికా..

బాలీవుడ్ స్టార్ హీర్ షారూఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే న‌టించిన‌ రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.. 2013 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా 2020 ఆగస్టు 10 నాటికి ఏడేళ్లు పూర్తవుతోంది.



రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం ప‌లు రికార్డులను కూడా బద్దలుకొట్టింది. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ న‌టి దీపికా పదుకొనే కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు….Chennai Expressఏడు సంవత్సరాల నాటి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను ఎప్పటికీ మర్చిపోలేం అని రాశారామె. దీపికా పదుకొనే షేర్ చేసిన ఫొటోల్లో హీరో షారూఖ్ ఖాన్‌, చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా క‌నిపిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌  చెన్నై ఎక్స్‌ప్రెస్ తమిళనాడు నేపథ్యంలో నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.



దీపికా, షారుఖ్‌ల నటన, కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ ప్లస్ అని చెప్పాలి. సత్యరాజ్, నిఖిత్ ధీర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలోని లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రియమణి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయమైంది.

https://www.instagram.com/p/CDqX2wRjhoW/?utm_source=ig_web_copy_link