83 Movie : హార్ట్ బీట్ పెంచేసిన టీజర్..

కపిల్ దేవ్ బయోపిక్‌ ‘83’ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది..

83 Movie : హార్ట్ బీట్ పెంచేసిన టీజర్..

83

83 Movie: టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ ‘83’ పేరుతో సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ పాత్రలో ర‌ణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983లో భారత జట్టు ప్రపంచకప్‌ ఎలా సాధించింది అనే ఆసక్తికర అంశంతో క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కపిల్ భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది.

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, విబ్రి మీడియా, ఫాంటోమ్ ఫిల్మ్స్, కేఎ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘83’ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

Varun Dhawan : వోల్ఫ్‌గా వరణ్ ధావన్!

1983 జూన్ 25 లండన్‌లోని లార్డ్స్ మైదానంలో భారతీయ క్రికెట్ హిస్టరీలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఆ ఇన్సిడెంట్‌‌తోనే ‘83’ టీజర్ కట్ చేశారు. విజువల్స్, ఆర్ఆర్ గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు హార్ట్ బీట్ పెంచేశాయి. నవంబర్ 30 ట్రైలర్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 24 తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ‘83’ పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది.