ఆడ లేడీస్ అల్లాడించేసారుగా!

90 ఎంఎల్ ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : February 9, 2019 / 11:12 AM IST
ఆడ లేడీస్ అల్లాడించేసారుగా!

90 ఎంఎల్ ట్రైలర్..

ఈ జెనరేషన్ యూత్ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. అలాంటి అదిరిపోయే అడల్ట్ కంటెంట్‌తో, కోలీవుడ్‌లో 90 ఎంఎల్ అనే సినిమా రాబోతుంది. అంతకుముందు హీరోయిన్‌గా నటించినా పెద్దగా గుర్తింపు లేని ఓవియా, తమిళనాట బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెతో పాటు, మోనీషా, మసూమ్, శ్రీ గోపిక తదితరులు మెయిన్ లీడ్స్‌గా, అళగియా అసుర డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఓవర్ ఎక్స్‌పోజింగ్, విచ్చలవిడి శృంగారం, లిప్‌లాక్‌లు, మందు కొట్టడం, దమ్ము లాగడం.. ఇలాంటి వాటితో నిండిపోయింది ట్రైలర్.. ట్రైలర్ చూసి ఆడియన్స్ షాక్ తిన్నారు.

తమకి నచ్చినట్టు లైఫ్‌ని ఎంజాయ్ చేసే అయిదుగురు అమ్మాయిల కథ ఇది. తమిళ యంగ్ హీరో ఎస్.టి.ఆర్. (శింబు) సంగీతమందిస్తున్నాడు. ట్రైలర్ చివర్లో కనిపించి, సందడి చేసాడు కూడా.. ట్రైలర్ చూసాక చాలామంది, ఇలాంటి సినిమా చేస్తున్నావేంటి? అని ఓవియాని అడిగితే, ఫ్రూట్ తినేముందు, దాని సీడ్‌ని జడ్జ్ చెయ్యకండి, సినిమా రిలీజయ్యే వరకూ ఆగండి.. అని చెప్తుంది. 
 త్వరలో 90 ఎంఎల్ రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి కెమెరా : అరవింద్ కృష్ణన్, ఎడిటింగ్ : ఆంటొనీ, ఆర్ట్ : పురుషోత్తం, స్టంట్ : మిరాకిల్ మైఖేల్.
వాచ్ 90ఎంఎల్ ట్రైలర్…