Oscar Awards : 94వ ఆస్కార్ విజేతలు వీరే.. ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం

ఇటీవల 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ వెల్లడించగా తాజాగా నిన్న మార్చ్ 27న ఈ అవార్డుల ప్రధానం జరిగింది. ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డులకు అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ........

Oscar Awards : 94వ ఆస్కార్ విజేతలు వీరే.. ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం

Oscars

Oscar Awards :  ప్రపంచ సినీ పరిశ్రమకి అతి పెద్ద అవార్డు ఆస్కార్. ఎంతో మంది సినిమా వాళ్లకి ఆస్కార్ ఒక కల. ఇటీవల 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ వెల్లడించగా తాజాగా నిన్న మార్చ్ 27న ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డులకు అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక అయింది. ఈ సారి అవార్డులకు ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’, ‘డ్యూన్‌’, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్‌’ సినిమాలు అత్యధిక కేటగిరీలలో నామినేషన్లు సాధించాయి.

 

RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా..

94వ ఆస్కార్ అవార్డుల విజేతలు.. వారి సినిమాలు

ఉత్తమ నటుడు: విల్ స్మిత్ – కింగ్ రిచర్డ్

ఉత్తమ నటి: జెస్సికా చస్టీన్ – ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే

ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌స‌ర్‌ – కోడా మూవీ

ఉత్తమ సహాయ నటి: అరియనా డిబోస్ – వెస్ట్ సైడ్ స్టోరీ

ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ – ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’

ఉత్తమ చిత్రం: కొడా

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: డ్రైవ్ మై కార్

ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎన్‌కాంటో

ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: ది విండ్ షీల్డ్ వైపర్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద లాంగ్ గుడ్ బై

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెనత్ బ్రానో – బెల్ ఫాస్ట్ మూవీ

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: షాన్ హైడర్ – కోడా మూవీ

ఉత్తమ ఛాయాగ్రహణం: గ్రీగ్ ఫ్రైజ‌ర్‌ – డ్యూన్ మూవీ

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్ – డ్యూన్ మూవీ

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: హన్స్ జిమ్మర్ – డ్యూన్ మూవీ

ఉత్తమ సౌండ్: మాక్ రూత్, మార్క్, థియో గ్రీన్, డౌగ్ హెంఫిల్, రోన్ బార్ట్లెట్ – డ్యూన్

ఉత్తమ ఎడిటింగ్: జో వాకర్ – డ్యూన్ మూవీ

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బివాన్ – క్రూయెల్లా మూవీ