K Viswanath : బాలసుబ్రహ్మణ్యంతో గొడవ విశ్వనాథ్‌ని నటుడిని చేసింది..

తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా ఇండస్ట్రీలో దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే నటుడిగా మారడం వెనుక పెద్ద కథే ఉంది.

K Viswanath : బాలసుబ్రహ్మణ్యంతో గొడవ విశ్వనాథ్‌ని నటుడిని చేసింది..

k viswanath actor

K Viswanath : తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు అంతా కళాతపస్వికి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ షూటింగ్ సెట్‌లో ఖాకీ డ్రెస్‌లో ఉండడానికి గల కారణం తెలుసా?

1951లో వచ్చిన ‘పాతాళభైరవి’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సినీ ప్రస్థానం మొదలుపెట్టిన విశ్వనాథ్.. ఆ తరువాత సౌండ్ ఇంజనీర్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత 1965 లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా ఇండస్ట్రీలో దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే నటుడిగా మారడం వెనుక పెద్ద కథే ఉంది.

విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రాల్లో ఒకటి ‘శుభసంకల్పం’. 1995 లో వచ్చిన ఈ సినిమాతోనే మొదటిసారి నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు విశ్వనాథ్. సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ తో మరో ముఖ్యమైన, సమానమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎంతో గంభీరంగా, హుందాగా ఉంటుంది. అంతేకాదు ఆ పాత్ర ముందు కమల్ హాసన్ ఎప్పుడు చేతులు కట్టుకొని ఉంటాడు. దీంతో ఆ పాత్ర కోసం విశ్వనాథ్ శివాజీ గణేశన్ ని అనుకున్నారట. కానీ అది ఎందుకో కుదరలేదు.

K Viswanath with Star Heros : స్టార్ హీరోలతో ప్రయోగాలు చేయించిన డైరెక్టర్ కె.విశ్వనాథ్..

ఇక ఆ పాత్ర కోసం వెతుకుతూనే షూటింగ్ మొదలు పెట్టేశారు. ఎంత షూటింగ్ అవుతున్నా ఆ పాత్రని నిర్ణయించకపోవడంతో విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం పై కోపడ్డారట. షూటింగ్ జరిగిపోతుంది, ఆ పాత్రకి నటుడిని కన్‌ఫార్మ్ చేయవేంటి అని విశ్వనాథ్ గట్టిగా ప్రశ్నించగా.. నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నా, నువ్వు షూటింగ్ చెయ్యి అని బదులిచ్చారట బాలసుబ్రహ్మణ్యం. మరి నాకు చెప్పాలి కదా, ఎవరు ఆ నటుడు అని విశ్వనాథ్ ప్రశ్నించగా.. ఆ పాత్ర మీరే చేయబోతున్నారు అంటూ సమాధానం ఇచ్చారట.

అది విన్న విశ్వనాథ్ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఏది పట్టించుకోను అని తెలుసు కదా. మరి నన్ను కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయమంటావు ఏంటి అని కోప్పడ్డారు. దాని గురించి ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. చివరికి బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్ర మీరు చేస్తేనే ఈ సినిమా చేదాం లేదంటే ఇక్కడే ఆపేదం అని చెప్పి కోపంగా వెళ్లిపోయారంట. ఇక చేసేది లేక విశ్వనాథ్ ఆ పాత్రని పోషించారు. నిజానికి బాలసుబ్రహ్మణ్యం ఎంపిక సరైనదే. ఆ పాత్రలో విశ్వనాథ్ తప్ప మరొకరిని ఉహించుకోలేము.

అప్పటి నుంచి మొదలైన విశ్వనాథ్ యాక్టింగ్ కెరీర్.. కలుసుందాంరా, నరసింహ నాయుడు, సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఎన్నో సినిమాలో నటించారు. అంతేకాదు అవార్డులు కూడా అందుకున్నారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా శుభసంకల్పం సినిమాకి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కలిసుందాంరా సినిమాకు నంది అవార్డులు గెలుచుకున్నారు.