Laal Singh Chaddha: అమీర్‌ఖాన్ భుజాలపై భారీ భారం.. బాలీవుడ్‌కు మళ్ళీ క్రేజ్ తెస్తాడా?

Laal Singh Chaddha: అమీర్‌ఖాన్ భుజాలపై భారీ భారం.. బాలీవుడ్‌కు మళ్ళీ క్రేజ్ తెస్తాడా?

Laal Singh Chaddha: స్టార్ హీరోల సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా లోకల్ లాంగ్వేజ్ సినిమాల విడుదలకు కాస్త వణుకు ఉండేది. షారుఖ్, సల్మాన్, హృతిక్, అమీర్ ఇలా చాలా మంది హీరోలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండేది. అందుకే సౌత్ ఇండస్ట్రీలలో కూడా బాలీవుడ్ సినిమా వస్తుందంటే కాస్త ముందూ వెనకా చూసుకొని తమ సినిమాల రిలీజ్ పెట్టుకొనే వాళ్ళు. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. మన సౌత్ సినిమాలు హిందీలో వసూళ్లలో దుమ్మురేపుతూ అక్కడ సినిమాలను కూడా నామరూపాలు లేకుండా చేస్తున్నాయి.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

ముందు పుష్ప.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్ 2.. వరసపెట్టి ఐదు నెలలుగా బాలీవుడ్ కు కంటి మీద కునుకు లేకుండా చేసేశాయి. ప్రస్తుతం థియేటర్లలో కేజీఎఫ్ హవా కొనసాగుతుండగానే కాస్త ధైర్యం చేసి.. ఏదో చిన్న ఆశతో ఈ వారం బాలీవుడ్ నుండి రెండు సినిమాలు రిలీజ్ చేశారు. టైగర్ ష్రాఫ్ సూపర్ క్రేజీ సిరీస్ టైగర్ పన్తి 2తో పాటు అజయ్ దేవ్ గన్ రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ 29న విడుదలవగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాల కంటే మూడో వారం నడుస్తున్న కేజీఎఫ్ 2 ఎక్కువ కలెక్షన్లను దక్కించుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Laal Singh Chaddha : బిగ్ పాన్ ఇండియా క్లాష్!

అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ఇద్దరూ యష్ ముందు నిలవలేకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ సీనియర్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మీద పెట్టుకున్నారు. అద్వైత్ చంద‌న్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న లాల్ సింగ్ చద్దా ఆగ‌స్టు 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. అంటే ఇంకా మూడు నెలలు పైనే సమయం ఉన్నా అమీర్ మాత్రమే సౌత్ హవాకి బాలీవుడ్ లో బ్రేకులేసి హిందీ సినిమాకి ఊపిరి పోస్తాడని బలంగా నమ్ముతున్నారు. పీకే, దంగ‌ల్ లాంటి చిత్రాల‌తో గతంలో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దుమ్ముదులిపిన చరిత్ర అమీర్ సొంతం కావడమే ఇందుకు కారణం.

Laal Singh Chaddha : అమీర్ ఖాన్‌‌తో నాగ చైతన్య, ఫొటోలో కిరణ్ రావు

అయితే.. లాల్ సింగ్ చద్దాలో కొన్ని డ్రా బ్యాక్స్ కూడా ఉన్నాయి. 1994లో బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు ఇది రీమేక్‌. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాలో ఇప్పుడు హిందీ ప్రేక్షకులు కోరుకొనే హీరో ఎలివేషన్స్ కష్టమే. అయితే.. డ్రామాతో అయినా అమీర్ తన రేంజ్ మ్యాజిక్ చూపించి నార్త్ ప్రేక్షకులను మాయ చేస్తే ఏదైనా జరగొచ్చు. మరి అమీర్ అంతటి టార్గెట్ ఛేదించి సౌత్ సినిమాల రికార్డులను అధిగమిస్తాడా? అన్నది చూడాల్సి ఉంది.