కష్టమని వస్తే చాలు ఆదుకుంటానంటోన్న సోనూసూద్ ఆస్తి ఎంతో తెలుసా..

కష్టమని వస్తే చాలు ఆదుకుంటానంటోన్న సోనూసూద్ ఆస్తి ఎంతో తెలుసా..

ఏదైనా కష్టం వస్తే ఊరిపెద్దనో.. పొలిటీషయన్నో అడిగే రోజులు పోయాయి. నేరుగా సోనూ సూద్ కే చెప్పుకునేట్లున్నారని కార్టూనిస్టులు చెబుతూనే ఉన్నారు. అలా వెళ్లిపోయింది సోనూ మంచి జనాల్లోకి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అందరికీ వెండితెరపై విలన్ గా పరిచయమైన సోనూ సూద్ కష్టమైన కరోనా సమయంలో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

పొట్టకూటి కోసం ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే వలస కూలీలను దిక్కుతోచని పరిస్థితుల్లో రైళ్లు,బస్సులు లేనప్పుడు సొంత గూటికి చేర్చాడు. సినిమాలో హీరోలం అని చెప్పుకునే చాలా మంది చెయ్యలేని పనిని చేశాడు. అప్పటి నుంచి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు. అక్కడి వారు, ఇక్కడి వారు అనే తేడా లేదు. ఎవరు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు.



కొద్దిరోజులు ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోమారు చాటుకున్నాడు. ఇలా అందరికి సాయం చేస్తున్న సోనూసూద్‌ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంటే అంతలా సాయం చేస్తున్నాడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో సోనూ సూద్ పై తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తేలింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ సూద్ సినిమాల ద్వారానే ఆ డబ్బును సంపాదించినట్లు తెలుస్తోంది.

నెగిటివ్‌ రోల్స్‌ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్‌ ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకునే విలన్‌లలో ఒకడు. సినిమాలలో సంపాదించిన డబ్బుతో ముంబైలో హోటళ్లు తెరిచాడు సోనూసూద్‌. కరోనా సమయంలో హోటళ్లు మూతపడినా సొంత డబ్బుతో సాయం చేసుకుంటూ వస్తున్నాడు. 2020లో ఆయన ఆస్తి విలువ రూ. 130 కోట్లుంటే లెక్కాపత్రం లేకుండా అడిగినవారికి లేదంటూ సాయం చేస్తూ పోతున్నాడు. అందుకే చాలా మంది రీల్‌ హీరోలను కాదు రియల్‌ హీరోలను ఫాలో అవుదాం అంటూ సోనూను ఫాలో అవుతున్నారు యూత్ అంతా.