Katrina Kaif : కత్రినా నా భార్య.. చంపేస్తాను అంటూ బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

గత కొద్దిరోజులుగా మన్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి కత్రినాతో నాకు పెళ్లి జరిగిందంటూ ఎడిటెడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళిద్దర్నీ చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు........

Katrina Kaif : కత్రినా నా భార్య.. చంపేస్తాను అంటూ బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Katrina Kaif

Katrina Kaif :  ఇటీవల బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా మన్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి కత్రినాతో నాకు పెళ్లి జరిగిందంటూ ఎడిటెడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళిద్దర్నీ చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. కత్రినా నా భార్య అంటూ పోస్టులు పెడుతూ, సోషల్ మీడియా వేదికగా కత్రినా- కౌశల్ ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఈ స్టార్ కపుల్ పోలీసులని ఆశ్రయించారు.

Ranveer Singh : న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకు రణవీర్ పై పోలీసు కేసు..

కత్రినా దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి మన్వీందర్‌ సింగ్‌ ని పట్టుకొని ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణలో సినిమా రంగంలో అవకాశాల కోసం వచ్చిన ఇతను కత్రినాకు వీరాభిమాని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు, కానీ కత్రినా విక్కీతో పెళ్లి చేసుకోవడంతో నిరాశకి గురయి ఇలా ఫేక్ వీడియోలతో కత్రినా-కౌశల్ ని ఇబ్బంది పెడుతున్నాడు అని తేలింది. ప్రస్తుతం మన్వీందర్‌ సింగ్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతుంది.