Rajamouli : మోడ్రన్ మాస్టర్స్ అంటూ.. రాజమౌళి పై డాక్యుమెంట్..

తాజాగా రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు కలిసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో.................

Rajamouli : మోడ్రన్ మాస్టర్స్ అంటూ.. రాజమౌళి పై డాక్యుమెంట్..

Rajamouli :  తెలుగు దర్శకుడు రాజమౌళి బాహుబలి, RRR సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎదిగారు. జక్కన్న ఇప్పుడు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. RRR సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచం నలుమూలలా మరింత వ్యాపించింది. ఈ సినిమాకి అనేక హాలీవుడ్ అవార్డులని అందుకుంటూ మరింత పేరు, ప్రఖ్యాతలు గడిస్తూ ఆస్కార్ టార్గెట్ గా దూసుకెళ్తున్నారు రాజమౌళి.

తాజాగా రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు కలిసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో భారతదేశం నుంచి సినీ పరిశ్రమలోని గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ని పరిచయం చేయబోతున్నారు. వారి వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రావెల్, కెరీర్.. ఇలా అన్ని అంశాలతో వారిపై ఒక డాక్యుమెంటరీలని నిర్మించనున్నారు.

Anikha surendran : హీరోయిన్ గా మారిన బాలనటి.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. ఏమంటుందో తెలుసా??

అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో మొదటగా మన రాజమౌళి ఎపిసోడ్ రానుండటం విశేషం. భారత సినిమాని ప్రపంచం నలుదిక్కులా వినిపించేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి టేకింగ్, మేకింగ్, లైఫ్ స్టైల్, సినిమా ప్రయాణం.. వీటన్నిటిని చూపిస్తూ డాక్యుమెంటరీ తీయనున్నారు. ఇందులో రాజమౌళి కొన్ని స్పెషల్ విజువల్స్ కోసం నటించారు కూడా. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ చిన్న ప్రోమోని విడుదల చేసి ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ఫస్ట్ ఎపిసోడ్ రాజమౌళి అంటూ ప్రమోట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ విడుదల చేయనున్నారు. దీంతో రాజమౌళి అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులంతా ఈ డాక్యుమెంటరీ కోసం ఎదురు చూస్తున్నారు.