Dhanush : ఆ స్టార్ హీరో ధనుష్‌కి వీరాభిమాని అంటా.. ఎవరు ఆ హీరో?

తమిళ స్టార్ హీరో ధనుష్ కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. '3', 'VIP' వంటి సినిమాలతో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారికీ దగ్గరయ్యాడు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలో నటించి పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం ఒక బై లింగువల్ మరియు ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా సౌత్ లోని ఒక స్టార్ హీరో ధనుష్ కి డై హార్డ్ ఫ్యాన్ అంటూ వెల్లడించాడు.

Dhanush : ఆ స్టార్ హీరో ధనుష్‌కి వీరాభిమాని అంటా.. ఎవరు ఆ హీరో?

A star hero is big fan of Dhanush

Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. ‘3’, ‘VIP’ వంటి సినిమాలతో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారికీ దగ్గరయ్యాడు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలో నటించి పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం ఒక బై లింగువల్ మరియు ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా సౌత్ లోని ఒక స్టార్ హీరో ధనుష్ కి డై హార్డ్ ఫ్యాన్ అంటూ వెల్లడించాడు.

Dhanush-Sekhar Kammula : తెలుగు క్లాస్ డైరెక్టర్ తో తమిళ్ స్టార్ హీరో సినిమా.. ఎట్టకేలకి మొదలు..

తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రంలో కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, ధనుష్ కి అన్నయ్యగా నటిస్తున్నాడు. 90’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తీ చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నించగా.. “నేను ధనుష్‌కి వీరాభిమానిని. అతని విడుదలైన ప్రతి మూవీ తప్పకుండా చూస్తా.

ఇప్పుడు అతనితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది” అంటూ తెలియజేశాడు. కాగా శివరాజ్ కుమార్, రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి అల్లుడు ధనుష్, మావయ్య రజినీకాంత్ తో కలిసి నటించడం విశేషం. కాగా ధనుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాలో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.