Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ప్రీరిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్!

సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 13న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ప్రీరిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్!

Aa Ammayi Gurichi Meeku Cheppali Pre-Release Date And Time Fixed

Aa Ammayi Gurinchi Meeku Cheppali: యంగ్ హీరో సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన సమ్మోహనం, వి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ మనముందుకు రాబోతుంది. సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్.. బొమ్మ హిట్టు!

ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 13న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు..

అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. దీంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎవరు వస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.