Aadhi Pinisetty : గొడవలయి విడిపోయాం.. కానీ.. నిక్కీ గల్రానితో పెళ్లిపై ఆది పినిశెట్టి

తాజాగా ఆది వారియర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిక్కీ గల్రానితో తన ప్రేమ, పెళ్లి ప్రయాణం గురించి తెలిపాడు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ...............

Aadhi Pinisetty : గొడవలయి విడిపోయాం.. కానీ.. నిక్కీ గల్రానితో పెళ్లిపై ఆది పినిశెట్టి

Nikki Galrani

Aadhi Pinisetty :  ఒక వి చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఆది పినిశెట్టి తమిళ్, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు ఆది. ఇటీవల వచ్చిన ది వారియర్ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించాడు. కొద్ది రోజుల క్రితమే ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పలువురు తెలుగు, తమిళ్ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు.

Indraja : తమ ప్రేమ గురించి బయటపెట్టిన ఇంద్రజ.. పెళ్లి ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తాజాగా ఆది వారియర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిక్కీ గల్రానితో తన ప్రేమ, పెళ్లి ప్రయాణం గురించి తెలిపాడు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ”నేనూ, నిక్కీ మలుపు సినిమా నుంచి మంచి స్నేహితులం. ఆ సినిమా ప్రయాణంలో మా ఇద్దరి మధ్య ఒకట్రెండుసార్లు గొడవలు కూడా జరిగాయి. మాట్లాడుకోవడం కూడా మానేశాం. కానీ ఆ సినిమా చివర్లో మేం మళ్లీ దగ్గరయ్యాం. ఆ తర్వాత కూడా పలు సినిమాలు కలిసి చేశాం. ఈ ప్రయాణంలో మా మధ్య ప్రేమ చిగురించింది. మొదట తనే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. నేను కూడా ఓకే చెప్పాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాతే ఇంట్లోవాళ్లకి చెప్పి ఒప్పించి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం సంతోషంగా సాగుతోంది. నేను, నిక్కీ గల్రాని కలిసి నటించిన ‘శివుడు’ సినిమా త్వరలోనే రాబోతుంది” అని తన ప్రేమ ప్రయాణం గురించి తెలిపారు.