Aadhi-Nikki: హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి.. రహస్యంగా నిశ్చతార్ధం ఏర్పాట్లు!

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సహజమే. అయితే.. ఇందులో కొందరు కొన్నాళ్ళు రిలేషన్ మైంటైన్ చేసి ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు పోతే మరికొందరు మాత్రం ఆ ప్రేమని పెళ్లి..

Aadhi-Nikki: హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి.. రహస్యంగా నిశ్చతార్ధం ఏర్పాట్లు!

Aadhi Nikki

Aadhi-Nikki: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సహజమే. అయితే.. ఇందులో కొందరు కొన్నాళ్ళు రిలేషన్ మైంటైన్ చేసి ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు పోతే మరికొందరు మాత్రం ఆ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మరో జంట ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని కూడా వాళ్ళ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లితో ముగింపు పలకనుందని తమిళ ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తుంది. సీక్రెట్ గా ప్రస్తుతం నిశ్చతార్ధం ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని కూడా చెప్పుకుంటున్నారు.

Nikki Galrani : ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకి ఫిర్యాదు

సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి కూడా తన వైవిద్యమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క విలన్ గా ‘సరైనోడు’ ‘అజ్ఞాతవాసి’ అలాగే సహాయనటుడుగా ‘నిన్ను కోరి’ ‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

అయితే, ఆదిపై ఇప్పటి వరకూ పెద్దగా రూమర్స్ వినిపించింది లేదు. ఆది ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్టు రెండేళ్లుగా కొద్దిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ పెద్దగా ఇది నమ్మలేదు. అదే నిజమని త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందన్నది ఇప్పుడు కోలీవుడ్ టాక్. కాగా, ఆ హీరోయిన్ మరెవరో కాదు నిక్కీ గల్రాని. ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించిన సంజనా గల్రాని చెల్లెలే ఈ నిక్కీ గల్రాని. ఆది హీరోగా నటించిన ‘మలుపు’,‘మరకతమణి’ చిత్రాల్లో ఈమె హీరోయిన్ గా నటించగా.. సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

గత రెండేళ్ల క్రితం ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకకి నిక్కీ హాజరవగా అప్పుడే ‘ఆది, నిక్కీ ప్రేమలో ఉన్నారు.. త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు’ అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే, ఈ పుకార్లకు ఎండ్ కార్డు పడేలా వీళ్ళ పెళ్ళికి ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్‌ పనులు జరుగుతుండగా.. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.