Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

సంకాంతికి పెద్ద సినిమాలన్నీ మొహం చాటేయడంతో చిన్న సినిమాలన్నీ పెద్ద పండగని టార్గెట్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ పండగకి వచ్చే సినిమాలలో ఆది సాయికుమార్ అతిధి దేవోభవ కూడా ఉంది

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

Atithi Devo Bhava

Atithi Devo Bhava: సంకాంతికి పెద్ద సినిమాలన్నీ మొహం చాటేయడంతో చిన్న సినిమాలన్నీ పెద్ద పండగని టార్గెట్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ పండగకి వచ్చే సినిమాలలో ఆది సాయికుమార్ అతిధి దేవోభవ కూడా ఉంది. ఆది హీరోగా, నువేక్షా హీరోయిన్ గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన అతిథి దేవోభవ సినిమా జనవరి 7వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

NTR : ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా??

ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించింది.

RGV : ట్విట్టర్లో కొనసాగుతున్న చర్చ.. పేర్ని నానికి ఆర్జీవీ రిప్లై

ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఆదికి చాలాకాలంగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే.. ఆది ప్రస్తుతం నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. అతిధి దేవోభవ సినిమా కనుక సక్సెస్ అయితే కెరీర్ మళ్ళీ గాడిన పడి రాబోయే సినిమాలకు ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది.