Tees Maar Khan: ‘తీస్ మార్ ఖాన్‌’గా దిగుతున్న ఆది..! | Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released

Tees Maar Khan: ‘తీస్ మార్ ఖాన్‌’గా దిగుతున్న ఆది..!

యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు యూత్ మెచ్చే సినిమాల్లో నటించి మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు ఆది సాయి కుమార్.....

Tees Maar Khan: ‘తీస్ మార్ ఖాన్‌’గా దిగుతున్న ఆది..!

Tees Maar Khan: యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు యూత్ మెచ్చే సినిమాల్లో నటించి మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు ఆది సాయి కుమార్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు.

Aadi Sai Kumar: “తీస్ మార్ ఖాన్” ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!!

ఒక నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తోంది. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేశారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.

Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..

ఇప్పటికే తీస్ మార్ ఖాన్ మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్‌లుక్, గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

×