Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..

వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీంతో ఆది చేతిలో ఇప్పటికే అరడజనుపైగా సినిమాలు.................

Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..

Top Gear

Aadi :  సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీంతో ఆది చేతిలో ఇప్పటికే అరడజనుపైగా సినిమాలు చేతిలో ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది స్టూడెంట్స్ మధ్య ఈ టైటిల్ లోగో లాంచ్ చేయడం విశేషం. టాప్ గేర్‌ అనే టైటిల్ ని ఈ సినిమాకి అనౌన్స్ చేశారు. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ తెలిపారు.

ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. చిత్రానికి K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..

పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, ఆర్జే హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.