ఆద్య, సితారలతో సూపర్‌స్టార్ సందడి

‘సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ విత్ ఎమ్‌బి’ పేరుతో ఆద్య, సితార కలిసి మహేష్ బాబుని ఇంటర్వూ చేశారు..

  • Published By: sekhar ,Published On : January 18, 2020 / 07:40 AM IST
ఆద్య, సితారలతో సూపర్‌స్టార్ సందడి

‘సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ విత్ ఎమ్‌బి’ పేరుతో ఆద్య, సితార కలిసి మహేష్ బాబుని ఇంటర్వూ చేశారు..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీక్ ప్రపంచ వ్యాప్తంగా రూ.105.56 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పింది.

Image

ఇదిలా ఉంటే మహేష్ కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి A&S అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ ఛానల్ కోసం ‘సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ విత్ ఎమ్‌బి’ పేరుతో ఆద్య, సితార కలిసి మహేష్ బాబుని ఇంటర్వూ చేశారు.

Image

వీళ్లిద్దరు అడిగిన ముద్దు ముద్దు  ప్రశ్నలకు మహేష్ తన స్టైల్‌లో సమాధాలిచ్చాడు. ఇంటర్వూ ఆద్యంతం ఫుల్ ఫన్నీగా సాగిపోయింది. సినిమా గురించి ఆద్య, సితార అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చిన మహేష్, సినిమా గురించి ఆద్య, సితారల అభిప్రాయం అడిగి.. వాళ్లు చెప్పిన ఆన్సర్స్‌కి ఇంప్రెస్ అయ్యి.. ఇద్దరికీ బిగ్ గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాడంతో ఆద్య, సితార హ్యాపీగా ఫీలయ్యారు.