‘ఆకాశం నీ హ‌ద్దురా’ ట్రైలర్ చూశారా!

10TV Telugu News

Aakaasam Nee Haddhu Ra: తమిళ స్టార్ సూర్య హీరోగా ‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.. ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతున్న సంగతి తెలిసిందే. అపర్ణ బాలమురళి కథానాయిక. దసరా కానుకగా సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డా.మోహన్ బాబు కీలకపాత్రలో నటించారు. సూర్య పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ వాయిస్ చెప్పారు. ఊర్వశి, పరేష్ రావెల్, కరుణాస్ కీలకపాత్రల్లో నటించారు.


ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథ ‘సింప్లి ఫై’ పుసక్తానికి కల్పిత వెర్షన్‌గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది.


ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయాలనుకున్నారు కానీ.. మరో రెండు వారాలు ఆలస్యంగా నవంబర్‌ 12న ‘ఆకాశం నీ హ‌ద్దురా’ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మ్యూజిక్: జి వి ప్రకాష్ కుమార్, సినిమాటొగ్రఫీ: నికేత్ బొమ్మి, ఎడిటింగ్: సతీష్ సూర్య.

×