Aamir Khan : ‘లవ్ స్టోరీ’ ఈవెంట్‌కి అతిథిగా ఆమీర్ ఖాన్..

‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు..

Aamir Khan : ‘లవ్ స్టోరీ’ ఈవెంట్‌కి అతిథిగా ఆమీర్ ఖాన్..

Aamir Khan

Aamir Khan: అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేసింది.

Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..

సెప్టెంబర్ 24 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ‘లవ్ స్టోరీ’.. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇక సెప్టెంబర్ 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. కింగ్ నాగార్జున కూడా అటెండ్ అవబోతున్నారు.

Love Story : చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా చైతు సినిమా ఫంక్షన్..

ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కూడా ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాబోతున్నారు. అయితే మూవీ టీం హైదరాబాద్ తర్వాత వైజాగ్‌లోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆమీర్ అతిథిగా వచ్చేది హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి లేక వైజాగ్ ఈవెంట్‌కా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ‘లవ్ స్టోరీ’ ఈవెంట్‌‌కి ఆయన రావడం మాత్రం పక్కా అని చెప్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ తో చైతు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య అడగ్గానే ఆమీర్ తప్పకుండా వస్తానని మాటిచ్చారట.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..