Aamir Khan-Kiran Rao: కలిసి పనిచేస్తాం.. విడాకుల తర్వాత చేతులు కలిపిన ఆమీర్‌ఖాన్-కిరణ్ రావ్..!

ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు.. వారి పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు స్వయంగా ప్రకటించారు.

Aamir Khan-Kiran Rao: కలిసి పనిచేస్తాం.. విడాకుల తర్వాత చేతులు కలిపిన ఆమీర్‌ఖాన్-కిరణ్ రావ్..!

Amir Khan

Aamir Khan-Kiran Rao hold hands: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు.. వారి పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు స్వయంగా ప్రకటించారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాప‌కాలు, ఆనందాలు, హాయిగా గ‌డిపిన రోజులు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ంటూ.. వెల్లడించిన వారు ఇక‌పై విడివిడిగా కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెట్ట‌ాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు.

”ఇకపై భార్యాభర్తలుగా కొనసాగబోం. మా పిల్లలకు తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా జీవిస్తాం” అని ఇప్పుడు ప్రకటించినప్పటికీ, కొద్దికాలం కిందటే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వాళ్లు వెల్లడించారు. ఇదే సమయంలో వారి అబ్బాయి ఆజాద్ పెంపకం బాధ్యతలు ఇద్దరం చూసుకోనున్నట్లు.. సినిమాలు, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేయనున్నట్లు వారు చెప్పారు.

వీరిద్దరూ విడిపోతూ విడుదలచేసిన వీడియోలో.. విడిపోయేప్పుడు కనిపించే నిర్వేదం, కోపం, అసహనం ఏమీ కనిపించకపోవడం షాకింగ్‌గా అనిపిస్తుంది. అభిమానుల కోసం ఇచ్చిన వీడియో సందేశంలో చేతులు పట్టుకుని మేం విడిపోయినా కూడా ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. మేం విడిపోతున్నాం కానీ, కుటుంబ సభ్యులుగా మాత్రం కాదు అంటూ చేతులు కలిపి విడిపోతున్నట్లు ప్రకటిస్తూ.. మరో విషయంలో మాత్రం ఎప్పటికీ చేతులు కలిపే ఉంటాం అని వెల్లడించారు.

మా సారధ్యంలో స్టార్ట్ అయిన పానీ ఫౌండేషన్ మాకు కొడుకు లాంటిదే. ఆ ఫౌండేషన్ మాత్రం ఎప్పటికీ కలిసే నడిపిస్తాం.. పదిహేనేళ్ల వివాహ బంధం ముగిసినా కూడా కుమారుడు ఆజాద్, నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ పానీ విషయంలో చేతులు కలిపే పనిచేస్తాం అంటూ ప్రకటించారు. మా బిడ్డతో సమానమైన ఫౌండేషన్ విషయంలో ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)